Breaking News

నూతన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మహీంద్రా ట్రియో ఆవిష్కరణ

mahindra electric auto01

విజయవాడ: యుఎ డీ 19.4 బిలియన్ డాలర్ల మహీంద్రా గ్రూప్ లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సోమవారం నాడు నగరంలోని మహేంద్ర షో రూమ్ లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మహీంద్రా ట్రియోను ఫేమ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండీ అండ్ సీఈవో, మహేష్ బాబు మాట్లాడుతూ తమ నూతన రాయితీల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో 2.7 లక్షల రూపాయలతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మహీంద్రా ట్రియోను ఫేమ్ ను ఆవిష్కరించామని తెలిపారు. నూతన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోను పూర్తిగా భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేశారన్నారు. ఇది అత్యున్నత శ్రేణి పనితీరును గరిష్టంగా 55 కెఎంపీహె అందిస్తుందన్నారు. కేవలం 2.3 సెకన్లలోనే 0-20 కెఎంపిహెచ్ వేగం అందుకోవడంతో పాటుగా తమ శ్రేణిలో ఉన్నతమైన గ్రేడబిలిటీ 12.7 డిగ్రీలు ప్రదర్శిస్తుందన్నారు. నూతన మహీంద్రా ట్రియోతో సంవత్సరానికి 45 వేల రూపాయలవరకూ వాహన యజమానులు ఆదా చేసుకోవచ్చన్నారు. ట్రియోను కేవలం 50 వేల రూపాయల అతి తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి మహీంద్రా ఫైనాన్స్ మరియు అతి తక్కువ వడ్డీ రేటు పథకమైన 10.8 % తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఋణాలను పొందవచ్చన్నారు.మహీంద్రా ట్రియో వాహనాలు ఆకర్షణీయమైన మార్పిడి బోనస్ అయినటువంటి 5 వేల రూపాయలతో వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత వేగంగా ఈవీలను స్వీకరిస్తుందని, మరియు ఈ విభాగంలో ఇప్పటికే మార్కెట్ లీడర్ గా ట్రియో వెలుగొందుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 100 కు పైగా ట్రియోలు రోడ్ల మీద తిరుగుతున్నాయని, భారతదేశ వ్యాప్తంగా 400 కు పైగా జిల్లాల్లో 5 వేలకు పైగా ట్రియో సంతోషకరమైన వాహనదారులు తిరుగుతుండటంతో పాటుగా ఇప్పటికే ట్రియో 1.6 కోట్ల కిలోమీటర్లను భారతీయ రోడ్లపై ప్రయాణించారని తెలిపారు. నూతన మహీంద్రా ట్రియో మరింతగా తమ వినియోగదారులకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తుందని, రాష్ట్రపు తొలి,తుది మైలు మొబిలిటీ అవసరాలను ఇది ఖచ్చితంగా తీర్చగలదన్నారు. భారతీయ ఈవీ వృద్ధిపై ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఆధిపత్యం వహిస్తాయని మేము పూర్తిగా నమ్ముతున్నామన్నారు.ఇది ఆర్ధికంగా, పర్యావరణపరంగా మరియు సామాజికంగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *