Breaking News

నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలా: బుద్ధా వెంకన్న

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్‌ అయ్యారు. నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. మూడు నెలలుగా ఏం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉన్నది మీరన్న విషయం మర్చిపోకండి. వరల్డ్ బ్యాంక్ వెళ్లిపోవడానికి మీ కుట్రే కారణమని బయటపెట్టిన.. పత్రికలను అవమానపరుస్తారా? రాజధానిపై ట్విట్టర్‌లో కాదు.. దమ్ముంటే రైతుల ముందుకొచ్చి మీ పార్టీ వైఖరి చెప్పండి’’ అంటూ ట్వీట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *