Breaking News

పోలీస్ కానిస్టేబుల్ పై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ముద్దాయిలు అరెస్టు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం.

కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ నిర్లక్ష్యంగా ఉండకూడదని ,మాస్కు పెట్టుకోమని తన వంతు బాధ్యతగా హెచ్చరించి నందుకు కు కానిస్టేబుల్ నాగరాజు తో గొడవపడి అతనిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు ముద్దాయిలు తబ్రేజ్ ,జానీ మరియు అబ్దుల్ అజీం లను అరెస్టు చేయడం జరిగిందని పై ముగ్గురుని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసుం భాష తెలిపారు..ఈరోజు ఉదయం మచిలీపట్నం లోనే రైతు బజార్ వద్ద మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేసిన ఘటనను జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగిందని వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది.వారిపై రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసుం భాష తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *