Breaking News

ప్రజల రక్షణ కోసమే న్యాయస్థానాలు కృష్ణా జిల్లా జడ్జి రామకృష్ణ

కృష్ణ జిల్లా మచిలీపట్నం:

■క్షేత్రస్థాయిలో పౌరల హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని కృష్ణా జిల్లా ప్రధాన న్యా యమూర్తి జి. రామకృష్ణ అన్నారు.

■న్యూఢిల్లీ, జాతీయ సేవా అధికార సంస్థ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుండి 12 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

■కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ లేడీ యంఫ్తుల్ బాలికల కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు కు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

★ జిల్లా జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ వారి రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తుల పట్ల చట్టాలు కఠినంగా వుంటాయని తెలియజేశారు.

విద్యార్థినీ విధ్యార్థులుఆత్మవిశ్వాసంతో ఉండాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థి తన జీవితంలో “దిశానిర్దేశం” చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా జడ్జి రామకృష్ణ విద్యార్థినిలకు నిర్భయ, అభయ దిశ చట్టాల గురించి తెలియజేశారు.

ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఇబ్బంది కలిగినప్పుడు 100,1098 నెంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందాలని తెలియజేశారు. త్వరలోనే కళాశాలలో “లా క్లబ్” ఏర్పాటుచేసి విద్యార్థినిలకు చట్టాల పట్ల మరింత అవగాహన కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ రూపాయి విలువ తెలుసుకోవాలని, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని అన్నారు.

★అన్ని వృత్తుల కంటే గురువు స్థానం మహోన్నతమైన దని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులలో మార్పు వచ్చినప్పుడే మంచి సమాజానికి నాంది ప్రస్తావన అవుతుందని, ప్రతి ఒక్కరూ దేశానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని రామకృష్ణ అన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి.రాజారాం మాట్లాడుతూ దేశ రాజధాని నుండి జిల్లాలో వివిధ ప్రాంతాల వరకు నిరంతరం న్యాయస్థానాలు, న్యాయసేవాధికార సంస్థ లు ద్వారా సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అన్ని సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరికి ఇబ్బంది కలిగినా పోస్ట్ కార్డు ద్వారా తెలియపరిస్తే తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

◆సభకు అధ్యక్షత వహించిన కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ కృష్ణా జిల్లా జడ్జి గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని లేడియంప్తిల్ కళాశాలలో ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ చట్టాల పట్ల కనీస పరిజ్ఞానం తో ఉండాలని, చట్టాన్ని న్యాయాన్ని అందరూ గౌరవించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. రాకేష్ కుమార్, అధ్యాపకులు రేపల్లె రాంబాబు, మునవర్ తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో చిలకలపూడి సి.ఐ. అంకబాబు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థునిలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *