Breaking News

మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందించి వివరిస్తున్న అమరావతి మహిళా జేఏసీ నేతలు

మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందించి వివరిస్తున్న అమరావతి మహిళా జేఏసీ నేతలు

ఎపి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని విజ్ఞప్తి

– నిర్మలా సీతారామన్‌కు కలిసి వినతి పత్రం అందచేసిన అమరావతి మహిళా జేఏసి నేతలు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను అమరావతి మహిళా జేఏసి నేతలు కలిసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగానే ఉంచాలని వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. బుధవారం గన్నవరం మండలం జక్కుల నెక్కలంలో పర్యటించన కేంద్ర మంత్రి సీతారామన్ అమరావతి మహిళా జేఏసీ నేతలు సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, గద్దె అనూరాధ, నార్ల మాలతీ, చెన్నుపాటి ఉషారాణిలు కలిసి రాజధానిని తరలించవద్దని వినతి పత్రం సమర్పించారు. జగన్ వ్యక్తిగల స్వార్ధం కోసం ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారని, అమరావతి రాజధానిగా ఉండాలని జగన్ తప్ప ఆంధ్రరాష్ట్ర ప్రజలతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని వివరించారు. బిజెపి కూడా అమరావతికి మద్దతు పలికిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. అనంతరం అక్కినేని వనజ, సుంకర పద్మశ్రీతో పాటు మహిళా జెఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారమానకు అమరావతి రాజధానిగా కొనసాగాలని వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. కేంద్రం సరైన సమయంలో సానుకూలంగా స్పందిస్తుందని అన్నారని తెలిపారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగుతుందని ప్రకటన చేసే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *