Breaking News

మచిలీపట్నంలో ఎక్కడ చూసినా స్థానిక మంత్రి పేర్ని నాని కు వస్తున్న ఆదరణ

కృష్ణాజిల్లా మచిలీపట్నం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎక్కడ చూసినా స్థానిక మంత్రి పేర్ని నాని కు వస్తున్న ఆదరణ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న యువత ఎక్కువగా పేర్ని నాని అభిమానులుగా మారుతున్నారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక సేవకుడిగా ప్రతి కుటుంబంలో సభ్యునిగా వారి యోగక్షేమాలు గురించి వాకబు చేస్తూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలపై ప్రతిరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రతి పక్షాలు సైతం విమర్శలు చేయడానికి అవకాశం లేకుండా సూటిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరువయ్యేలా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమవుతున్నారు అని ప్రజలు తెలియజేస్తున్నారు. త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న తరుణంలో ప్రజల్లో పేర్ని నాని కు మంత్రివర్గంలో సీటు దక్కుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇటీవల కాలంలో శాఖల వారీగా మంత్రుల పనితీరు లో టాప్ ఫైవ్ గా రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఉండటం కూడా ఒక కారణంగా ప్రజలు చెబుతున్నారు. మరికొంత కాలం రాష్ట్ర మంత్రిగా పేర్ని వెంకట్రామయ్య నాని కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *