Breaking News

మనని మనం కడుక్కోవాలి జగన్ గారూ: కేశినేని నాని

బుధవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవస్థను కడిగేయాలని, అందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కలెక్టర్లు, ఎస్పీలు కూడా మనసు పెడితే అవినీతి నిర్మూలన సాధ్యమేనని తెలిపారు. దీనికి సంబంధించి ఓ పత్రికలో వచ్చిన వార్తను టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో షేర్ చేసి.. జగన్‌పై సెటైర్లు వేశారు. ‘‘వ్యవస్థను కడిగే ముందు మనని మనం కడుక్కోవాలి జగన్ గారూ! కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థను కడగగలవు. ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా కడగగలరు’’ అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *