Breaking News

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ‘ఉల్లి’ బాంబు పేలుతుందా

దేశంలో ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉల్లి ధర కిలో 80రూపాయలకు చేరినందు వల్ల దీని ప్రభావం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఢిల్లీలో 1998లో ఉల్లి కిలో ధర యాభైరూపాయలకు చేరుకోవడంతో అప్పడు అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో ఉల్లి ధరలు తగ్గించేందుకు మోదీ సర్కారు యత్నాలు ప్రారంభించింది. పెరిగిన ఉల్లి ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. దీంతో పాటు ఉల్లి ధరలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ఏం చేయాలనే విషయమై అధ్యయనం చేసేందుకు వీలుగా కేంద్ర అధికారుల బృందాన్ని దేశంలోనే ఉల్లి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రాలోని లాసల్ గావ్ మార్కెట్ కు పంపించింది. ఉల్లి ధరలు దిగిరాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఉల్లి’ బాంబు పేలి బీజేపీ అపజయం పాలయ్యే ప్రమాదముంది. దీంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఉల్లి ధరల నియంత్రణపై దృష్టి సారించింది. ఉల్లి ధరలు పెరుగుతుండటం బీజేపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. మూడురాష్ట్రాల ఎన్నికల్లో ఉల్లి ధరల పెంపు ప్రభావం ఏమేర ఉంటుందో ఓటర్ల తీర్పు కోసం వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *