Breaking News

మొబైల్‌లో చూస్తూ ప్రమాణం చేసిన రేవంత్‌

లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారాల పర్వం కొనసాగుతోంది. ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారం మంగళవారం జరిగింది. రాష్ట్రం నుంచి తొలుత అదిలాబాద్‌ ఎంపీ సోయం బాబురావు, ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తదితరులు ప్రమాణం చేశారు.

అయితే ఎంపీ రేవంత్‌ రెడ్డి.. లోక్‌సభ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని తిరస్కరించారు. తన మొబైల్‌లో ప్రమాణపత్రాన్ని చూస్తూ తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. ఇక కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పోతగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, కవిత మాలోత్‌, నామా నాగేశ్వరరావు తదితరులు కూడా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో వారి వెనుకే కూర్చున్న హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి బల్ల చరిచి అభినందించారు. హైదరాబాద్‌ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్‌ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో సభ్యులు వందేమాతరం, భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడంతో సభ మారుమోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *