Breaking News

యలమంచిలి రవికి అవకాశం దక్కేనా !?

శాసన పరిషత్తు (ఎంఎల్సీ) ఎన్నికల నగారా మోగింది. శాసన సభ్యుల కోటాలో ఆరుగురికి కొత్తగా శాసన పరిషత్తులో స్దానం దక్కనుంది. శాసన సభలో బలాబలాలను అనుసరించి మొత్తం ఆరు స్దానాలు వైసిపికే దక్కనున్నాయి. పలువురు ఈ స్దానాల కోసం పోటీ పడుతుండగా విజయవాడ తూర్పు మాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవికి అవకాశం లభిస్తుందా లేదా అన్నది ఆసక్తిదాయకంగా మారింది. విజయవాడ నగర రాజకీయాలలో యలమంచిలి కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ మరే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. యలమంచిలి నాగేశ్వరరావు శాసన సభ్యునిగా పనిచేసినా,  తరువాత రవి  శాసనసభ్యునిగా సేవలు అందించినా మచ్చలేని మనుషులుగానే పేరు గడించారు. గత శాసన సభ ఎన్నికలకు ముందు వైసిపి తీర్దం పుచ్చుకున్న యలమంచిలి రవి విజయవాడ తూర్సు నుండి అభ్యర్దిగా ఖరారు అయ్యారు. చివరి నిమిషంలో సీటు విషయంలో మార్పు జరిగినా పార్టీ అధినేత అదేశాలకు తలొగ్గి నాటి నుండి నేటి వరకు పార్టీ కోసమే పనిచేస్తూ వచ్చారు. గుడివాడలో తెలుగుదేశం అభ్యర్దిగా పరాజయం పాలయిన దేవినేని అవినాష్ వైసిపిలో ప్రవేశించిన తరువాత, అప్పటి వరకు ఉన్న నియోజక వర్గ ఇన్ చార్జిగా ఉన్న రవిని అధినాయకత్వం మార్చింది. అసెంబ్లీ సీటు ఇవ్వలేక పోయిన సరిస్ధితులలో రవి సేవలను తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. యలమంచిలి రవి పట్ల ఉన్న ప్రత్యేక అపేక్షతో ఆయన కుమారుడు రాజీవ్ వివాహ వేడుకకు కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి యలమంచిలికి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది విజయవాడలో చర్చనీయాంశమైంది. నిజానికి గత ఎన్నికలలో వియవాడ తూర్పు సీటును రవికి ఇచ్చిఉంటే తప్పనిసరిగా విజయం సాధించే వారిమన్న దిశగా పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చ నడిచింది. ఈ ప్రభావం విజయవాడ పార్లమెంట్ సభ్యుని గెలుపుపై కూడా పడింది. ప్రజాసేవ చేయటం మినహా నేటి తరం రాజకీయాల పరంగా ఒకింత వెనుకపడ్డ యలమంచిలి రవికి అవకాశం లభిస్తే పార్టీలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందన్న భావన సర్వత్రా ఉంది. విభిన్న సామాజిక వర్గాల పరంగానూ అజాత శత్రువుగా వియయవాడలో రవికి ఉన్న ప్రాముఖ్యత ఎంచదగినదే. తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే అయిన నేపధ్యంలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 
 
 
 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *