Breaking News

రైతు మరణంపై మండలిలో రచ్చ

ఇటీవల అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం వెళ్లి రైతు మరణించిన ఘటనపై చర్చించాలన్న తెదేపా డిమాండ్ శాసనమండలిలో కాసేపు వాడివేడి చర్చకు దారితీసింది. శాసనమండలి ప్రారంభం కాగానే… రైతుల మరణాలపై తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. వ్యవసాయ మంత్రి కుటుంబ సభ్యులు మరణించిన కారణంగా ఆయన అందుబాటులో లేరని మరోసారి దీనిపై చర్చిస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమాధానం ఇచ్చారు. ‘రైతు చనిపోతే సభలో చర్చించరా?’ అంటూ తెదేపా సభ్యులు నిలదీశారు. వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. గత ఐదేళ్లలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదా అంటూ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి సమాధానమిచ్చారు. ఈ సమయంలో తెదేపా పక్ష నాయకుడు యనమల జోక్యం చేసుకుని గతంలో కొన్ని సందర్భాల్లో వాయిదా తీర్మానంపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఛైర్మన్ వాయిదా తీర్మానం పై చర్చకు అనుమతించకపోవటంతో యనమల తమ సభ్యులను వెనక్కు పిలిచారు. రైతు మరణంపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని యనమల ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *