విశా
ఖపట్నం
విశాఖ రైల్వే స్టేషన్ ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్లో వాష్ బేసిన్ లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం కావడంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు.బుదవారం ఉదయం 8.25 గంటలకు రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మగబిడ్డను ప్రసవించి, రైలు నెం. 13351 ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్లో వదిలివేసిందని బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు సింహాచలం స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత సుమారు 8.20 గంటల సమయంలో బోకారో ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణీకులు శిశువు గురించి ఆన్‌బోర్డ్ టీటీ ఈ వి.బ్రహ్మాజీ తెలియ జేయడంతో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు.సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ పోలీసు లు రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారని ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స,సంరక్షణ నిమిత్తం కేజీహెచ్‌కు తరలించరుతల్లి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను సొంతం చేసుకుంటే వారి పెంపకానికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.