Breaking News

లంబసింగికి పర్యటకుల తాకిడి

ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో నేడు పర్యటకుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం  కావడంతో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు లంబసింగి చేరుకున్నారు.నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా మబ్బులతో నిండిన ఆకాశం  నిర్మలంగా ఉంది.దీంతో పొగమంచు దట్టంగా కురుస్తోంది నాలుగు రోజులుగా 18 నుంచి 17 డిగ్రీల మధ్య నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు నేడు తగ్గుముఖం పట్టాయి.నేటి ఉదయం చింతపల్లిలో 13 డిగ్రీలు, లంబసింగిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త ప్రవీణ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చారని లంబసింగి,తాజంగి గ్రామాలకు చెందిన స్థానికులు చెబుతున్నారు.మినుములూరులో 11 డిగ్రీలు మన్యంలో వారం రోజులుగా తగ్గిన చలి మళ్లీ పంజా విసురుతోంది.మూడు రోజులుగా మంచు వర్షం కురుస్తూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు సమీపంలోని మినుములూరు కాఫీ బోర్డు పరిశోధన కేంద్రం వద్ద ఈ నెల 1, 2 తేదీల్లో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా 3వ తేదీన 18 డిగ్రీలు, శుక్ర, శని వారాల్లో 15 డిగ్రీలు, ఆదివారం 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.సాయంత్రం 4 గంటల నుంచి వీస్తున్న చలిగాలులకు గిరిజనులు వణుకుతున్నారు. ఉదయం 9 గంటలైనా పొగమంచు దట్టంగా కురుస్తోంది.దీంతో పర్యాటకులు ఏంజాయ్ చేస్తున్నారు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *