Breaking News

లోకేష్ మాట నిజమే: వైసీపీ ఎమ్మెల్యే

నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకరబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేష్‌కి ఇంకా సిగ్గురాలేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పైనా, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నాలుగు పదాలు కూడా పలుకలేని లోకేష్ కూడా జగన్ గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. లోకేష్ ప్రెస్‌మీట్ పెట్టి.. గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను పలకాలన్నారు.

పాములు బయటకొచ్చాయని లోకేష్ అనడం విడ్డూరంగాఉందన్నారు. లోకేష్ మాట నిజమే.. గత 5 సంవత్సరాల్లో అనేక పాములు బయటకొచ్చాయని పేర్కొన్నారు. ప్రజలను హింసించడం వల్ల వాటిని ప్రజలు చావగొట్టారన్నారు. 23 మాత్రమే తప్పించుకున్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అవినీతి పాము ఒక్కటీ కూడా గెలవదని జోస్యం చెప్పారు. టీడీపీ నేతల అవినీతిని అసెంబ్లీలో బయటపెడతామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *