Breaking News

వరదలు వస్తే జగన్‌ అమెరికాలో కూర్చున్నారు: కన్నా

ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి.. కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేశారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక పాలసీకి సెప్టెంబర్‌ 5న ముహూర్తం పెట్టారన్నారు. కార్మికులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. వరదలు వస్తే జగన్‌ అమెరికాలో కూర్చున్నారని కన్నా ఆరోపించారు.

ప్రజలు మంచి మార్పు కోరుకొని జగన్‌కు అవకాశం ఇచ్చారని కానీ ఆయన గత ఐదేళ్ల సంగతే మాట్లాడుతున్నారు కానీ.. ప్రస్తుతం ఏంటనేది చెప్పలేదన్నారు. జన్మభూమి కమిటీల పేరు మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొస్తున్నారని కన్నా విమర్శించారు. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థ అదని ఆరోపించారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని కన్నా విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *