Breaking News

విలేకరుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

*సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.*
జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాలలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విలేకర్ల సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని జనసేన కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. ఆదివారం మచిలీపట్నం లో లంకిశెట్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వం హయాంలో తీవ్ర అన్యాయానికి గురైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఈ ప్రభుత్వం కూడా మొండి చేయి చూపించడం సమంజసం కాదని బాలాజీ అన్నారు.

అర్హులైన విలేకరులకు తక్షణమే. అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చి లిటిగేషన్ లో ఉన్న ఇంటి స్థలలు విలేకరులకి ఇచ్చి మోసగించినదని, ఈ ప్రభుత్వం అయినా విలేఖర్లకు న్యాయం చేయాలని అన్నారు.

కరోన పరిస్థితుల వలన విలేకరులు,కార్యాలయ సిబ్బంది గత రెండు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, విలేకరులకు ప్రభుత్వం తక్షణమే 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని బాలాజీ డిమాండ్ చేశారు.

విలేకర్ల అందరికీ బస్సు, రైల్వే పాసులు, హెల్త్ ఇన్సూరెన్స్, పిల్లలకు ఉచిత విద్యను కార్పొరేట్ స్కూల్లో ఇచ్చే విధంగా ఇచ్చిన జీ.ఓ లు అమలు పరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు.

ఇప్పటికే అనేక చిన్న పత్రికలు మూతపడిన విషయం అందరికి తెలిసిందే అని పెద్ద పత్రికల లో చాలామంది విలేకరులను ఫోటోగ్రాఫర్స్ ఉద్యోగాలు తీసివేసి వారిని ఏకాకి చేయడం జరిగిందని బాలాజీ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఫోర్త్ ఎస్టేట్ గా పని చేస్తున్నా విలేకరులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నోటి మాటతో కాకుండా తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు న్యాయం చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో విలేకరులు తరపున పోరాటం చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని లంకిశెట్టి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *