Breaking News

వి…శా..ల.. ధృక్పధం అంటే ఏమిటో. ….

శ్రీశ్రీశ్ర్రీ తెలకపల్లి రవి గారికి, బాబు అంటే ద్వేషమో, పగో లేక ఆంధ్రా అంటే కోపమో నాకు తెలియదు కానీ, అయన కక్కే విషాన్ని పాకిస్తాన్ బోర్డర్లో వదిలిపెట్టుంటే ఇరాన్ బోర్డర్ దాక పాకిస్తాన్ మొత్తం నాశనం అయ్యుండేది . ఘనత వహించిన రాజకీయ , సామాజిక విశ్లేషకుడు అనే బిరుదును భుజాల మీద మోస్తూ ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలడో నాకు అర్ధం కాదు.
అసెంబ్లీ భవనాన్ని ఆరునెలల్లో నిర్మించుకుంటే కనీసం అభినందనలు తెలపలేదు, పోనిలే, అనుకున్నా దాని మీద అభాండాలు వెయ్యటం ఎందుకు ?? స్పీకర్ ఎప్పుడో తరలించాలి అనుకున్నా ముఖ్యమంత్రి అడ్డు చెప్పాడట ( బహుశా ఈయన ప్రత్యక్ష సాక్షి అయ్యుండొచ్చు, అలా చెప్పిన విషయం స్పీకర్ కి, సి.యం కి కూడ తెలియకపోవచ్చు) . పోనిలే రాజకీయ విమర్శ అనుకుందాం, మరి అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నాయకుడికి కేవలం సాంకేతిక పరమైన ఆహ్వానం మాత్రమే పంపారట. విశాల ధృక్పధం తో పిలిచినట్లు ఈ తెలకపల్లి వారికి తోచలేదట . మరి ఈ వి…శా..ల.. ధృక్పధం అంటే ఏమిటో. అయనకే తెలియాలి. రాజధాని ప్రారంభానికి రాలేదు కాబట్టి అసెంబ్లీ ప్రారంభానికి పిలవాల్సిన పని లేదని పాలకపక్షం భావింఛిందట ,వస్తే ఎలాంటి ప్రాముఖ్యత కల్పిస్తారో కూడా ఆలోచింఛాల్సిన విషయమట. ప్రతిపక్ష నాయకుడికి ప్రొటోకాల్ ప్రకారం ఏ స్థానం కల్పిస్తారో తెలియకుండానే రాజకీయ, సామాజిక విశ్లేషకుడు అయ్యాడా !! పైగా అతన్ని ఎలా పిలుస్తాం అనే సమాచారం పాలకపక్షం నుండి వినిపించిందట, ఒకసారి ఆ సమాచారం ఏ ఫ్రీక్వెన్సీ లో వచ్చిందో చూడాలి. బహూశా 20 to 20,000 hz మధ్య అయ్యుండదు, రాజధాని నిర్మాణం అందరికీ సంబంధించింది అనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోతుంది అని కూడా బాధ పడ్డారు, బహుశా అందరూ అంటే ఈ తెలకపల్లి రవి గారే అయ్యింటారు,( ఒకసారి అంధ్రప్రభుత్వం ఈయన్ని పిలిచి, ఒక శాలూవా, మెమెంటో ఇవ్వాల్సిందిగా గట్టిగా కోరుకుంటున్నాం ) , ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములుగా చేస్తున్న విషయాన్ని ఈయన కావాలని గుర్తుపెట్టుకొని మర్చిపోతుంటాడు . భూ సమీకరణ మీద విమర్శలు ఉన్నాయట,ఆ సమస్యలు ఈయన తీరుస్తాడని, ఆవి ఏమిటో ఈయన చెవిలో ఎవరో చెప్పినట్లున్నారు
అంధ్రాలో రైతుల ఆత్మహత్యల గురించి బాగా భారంగా భాదపడ్డాడు, కానీ ఈ సంవత్సరం విపరీతమైన కరువు ఉన్నా ఆత్మహత్యల సంగతి తగ్గింది అనే విషయం ఈయన గుర్తించలేదు కాబట్టి, ఇంకా తగ్గలేదు అనే అనుకుంటున్నాడు,ఈయన అనుకుంటున్నాడు కాబట్టి అందరూ అనుకోవాల్సిందే అని అనుకుంటున్నాడు .
జి.డి,పి శాతం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది అని చెప్పారు కానీ, అన్ని రాష్ట్రాల కంటే జి.డి.పి సైజ్ మనదే పెద్దది అని ఎవ్వరూ , ఎక్కడా చెప్పలేదు. స్థూల ఉత్పత్తి విలువ ను రెండు సంవత్సరాల క్రితం కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి , భారతదేశ్ ఆర్ధిక రాజధాని గా పేరొందిన ముంబాయితో కూడిన మహారాష్ట్ర్రతో పోటి పెట్టీ దానితో పోలిస్తే మూడవ వంతే అని ఎద్దేవా చేయటంలో అర్దం ఏంటి ?? ఐ.టి రాజధాని కర్నాటక తో పోల్చి సగమే కదా అని పెదవి విరవటంలో మీ అక్కసు, ఎగతాళి ఎందుకు ?? రైతుల ఆత్మహత్యలు పెరిగాయి అని మీరే అంటారు, వ్యవసాయం 20 శాతం వృద్ది చెందింది అని మీరే అంటారు, మరి వ్యవసాయం లో వృద్ది కనపడింది అని ఆత్మహత్య చేసుకున్నారా రైతులు ??
చాలయ్యా తెలకపల్లి , మీ విషం చాలు, మీకు చంధ్రబాబుకి ఏవైనా పొలం గట్టు తగాదాలుంటే త్వరగా పరిష్కరించుకోండి, అంతే కానీ, మీ విషాన్ని, మా ఆంద్రప్రదేశ్ మీద కక్కకండి.
 
మోహన్.రావిపాటి
9000864857

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *