Breaking News

వైసీపీ సిద్ధం……

వైసీపీ సిద్ధం

  • రెడీ అంటున్న వైసీపీ
  • అభ్యర్థులపై కసరత్తు పూర్తి
  • టీడీపీ జాబితాను చూశాకే విడుదల
  • ఎన్నికల హామీల్లోనూ తీవ్ర కసరత్తు

        సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ సిద్ధపడుతోంది. జరగబోయే ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ అధినేత జగన్ రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యనేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని, ఈసారి అలా జరగదని ఆయన విశ్వాసంతో ఉన్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదలలో మాత్రం అధికార టీడీపీకంటే వ్యూహాత్మకంగా కొంచెం ఆలస్యంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

        రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వారిని అధికారికంగా వైసీపీ ప్రకటించలేదు. అధికారపక్షంలో అసంతృప్తవాదులు, బలమైన అభ్యర్థులు బయటికొస్తే వారికి వైసీపీ టికెట్లు కేటాయించడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారపక్షం నుంచి వీలైనంత ఎక్కువమంది బలమైన నేతల్ని ఆకర్షించడం ద్వారా విజయం సాధించొచ్చనే వ్యూహాంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 15 తర్వాత వైసీపీ తన అభ్యర్థులను అధికారికంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది.

        కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నుంచి మొదలుకొని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సీనియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్, దాసరి జైరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కిళ్లీ కృపారాణి, దాడి వీరభద్రరావు వంటి నేతలను వైసీపీలోకి జగన్ ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చి వైసీపీ తరపున రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచన జగన్ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 96 శాతం అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

        ఎన్నికల్లో అత్యంత కీలకమైన మ్యానిఫెస్టో విషయంలో ఆచితూచి వ్యవహారించాలని జగన్ నిర్ణయించారు. గతేడాది ప్లీనరీలో నవరత్నాల పేరిట కొన్ని హామీలను జగన్ ప్రకటించారు. వీటినే టీడీపీ కాపీ కొట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నవరత్నాలకు తోడు కొత్త హామీలపై దృష్టిపెట్టాలని పార్టీ మేనిఫెస్టో కమిటీని జగన్ ఆదేశించారు. ఈ కమిటీ మార్చి 13న సమావేశమై పని పూర్తిచేస్తోంది.

 

 

 

 

 

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *