Breaking News

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. నరేగా పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో పేర్కొన్నారు. 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. కూల్చివేతలు, ఒప్పందాల రద్దులతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందని చెప్పారు. తక్షణమే ఉపాధిహామీ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాధాన్యతాక్రమంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *