Breaking News

సౌదీ సింగర్ నోటివెంట గాంధీకి ఇష్టమైన భజనపాట

మహాత్మాగాంధీ 150వ జయంతిని దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు గాంధీ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇండియన్ ఎంబసీ అధికారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ సౌదీ సింగర్ బాపూజీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ భజన పాట పాడారు. ఆయన పాటకు ఫిదా అయిన ప్రేక్షకులు వీడియోను నెట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *