Breaking News

స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ యాషెస్‌ తొలి టెస్టులో రెండు శతకాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలుత శతకం బాది, రెండో ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేయడం స్మిత్‌కు ఇది తొమ్మిదోసారి. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ ఒక్కడే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా ఉండేవాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్‌(144, 142) రెండు శతకాలు సాధించి కలిస్‌తో సమానంగా నిలిచాడు.

వీరి తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌కుక్‌(8), ఆసీస్‌ దిగ్గజం అలెన్‌ బోర్డర్‌(7), విరాట్‌కోహ్లీ(7), రికీపాంటింగ్‌(7), కుమార సంగక్కర(7), సచిన్‌ తెందూల్కర్‌(7) వరుసగా ఉన్నారు. ఇదిలా ఉండగా గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న అతడు ఏడాది పాటు ఆటకు దూరమై ఈ మ్యాచ్‌ ద్వారానే టెస్టుల్లో పునరాగమనం చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత పోరాటం చేసి ఆసీస్‌కు విలువైన విజయాన్ని అందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *