Breaking News

స్పందనకు విశేష స్పందన

కృష్ణాజిల్లా మచిలీపట్నం

 

వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం జిల్లా ఎస్పీ

                                                                                     మీ సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించడానికి ఎల్లవేళలా సిద్ధం

స్పందన కార్యక్రమం లో భాగంగా ఈరోజు 2 ఐపీఎస్ గారు కరోన నియమ నిబందనలు అనుసరించి ప్రతి ఒక్కరూ మస్కు లు దరించి, భౌతిక దూరము పాటించేలా చర్యలు తీసుకొని స్పందన కార్యక్రమమును నిర్వహించారు

ఈ స్పందన కార్యక్రమానికి ఈ రోజు జిల్లా నలుమూలల నుండి 37 మంది ఫిర్యాదుదారులు వచ్చి జిల్లా ఎస్పీ గారి కి పిర్యాదులు అందజేయగా, స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలు, వినతులను స్వీకరించి, వారి యొక్క వ్యక్తిగత సమస్యలను గురించి జిల్లా ఎస్పీ గారు స్వయముగా ముఖా ముఖి అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన, పరిష్కారమయ్యేలా చూస్తామని, వారికి హామీ ఇస్తూ అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు..

 బంటుమిల్లి నుండి ఒక మహిళ వచ్చి, తమకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలు కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను, తన బిడ్డలను హింసిస్తున్నారని తనకు న్యాయం చేయమని ఎస్పీ గారిని కోరగా ఎస్పీ గారు బంటుమిల్లి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసి తగు విచారణ జరిపి పరిష్కారం చూపాల్సిందిగా తెలియజేశారు.

చల్లపల్లి నుండి ఒక వ్యక్తి వచ్చి తన నివాస స్థలానికి ఉన్న సరిహద్దు దారుడు స్థలాన్ని ఆక్రమించుకొని, ఇది తప్పు అని అడుగుతుంటే తనపై దాడికి పాల్పడుతున్నరని, రక్షణ కల్పించి న్యాయం చేయాల్సిందిగా ఎస్.పి గారికి ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదును చల్లపల్లి సిఐ గారికి బదిలీ చేసి చట్టపరిధిలో పరిష్కారం చూపాల్సిందిగా తెలిపారు.

 గుడివాడ నుండి ఒక మహిళ వచ్చి 2 సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నామని, ప్రారంభంలో తన భర్త సక్రమంగానే ఉన్న, ఇప్పుడు వేధింపులకు పాల్పడుతున్నారని, అదనపు కట్నం కోసం అత్తింటివారు హింసిస్తున్నారని న్యాయం చేయమని ఎస్పీ గారికి ఫిర్యాదు చేయగా, ఎస్పీ గారు ఆ ఫిర్యాదును గుడివాడ 1 టౌన్ సిఐ గారికి, బదిలీ చేసి తగు పరిష్కారం చూపాల్సిందిగా తెలిపారు.

మరికొన్ని ఫిర్యాదులను ఎస్ పి గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణగారు స్వీకరించి, ఫిర్యాది దారులతో మాట్లాడి సంబంధిత అధికారులతో, ఫిర్యాదులకు చట్ట పరిధిలో న్యాయం జరగాలని ఆదేశాలు జారీ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *