Breaking News

అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరై గల్లంతు

కృష్ణాజిల్లా,మచిలీపట్నం

కార్తీక పౌర్ణమి ముందు రోజే అపశృతి.మంగినపూడి బీచ్ లో విద్యార్థి గల్లంతు స్నేహితులతో సరదాగా బీచ్ కు వచ్చిన విద్యార్థి నవీన్ మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పేర్ని నాని కొట్టొచ్చినట్టు కనిపించిన భద్రతా ప్రమాణాలు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు ప్రారంభానికి ముందే అపశృతి చోటు చేసుకుంది. మంగినపూడి బీచ్ లో 8వ తరగతి విద్యార్థి గల్లంతు కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ (14) గూడూరు జడ్పీ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు.ఆదివారం కావటం, రేపు ఎల్లుండ పౌర్ణణి సముద్ర స్నానాలు కావటంతో తన స్నేహితులతో కలిసి బీచ్ కు వచ్చాడు.సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరైన నవీన్ గల్లంతయ్యాడు.గల్లంతైన నవీన్ కోసం మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

*మధ్యాహ్నం జరిగితే..*

మధ్యాహ్నం 2 గంటల సమయంలో విద్యార్థి గల్లంతైనట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని రాత్రి వరకు పొక్కనీయకుండా పోలీసులు జాగ్రత్త పడి గాలింపు చర్యలు చేపట్టారు.

*రంగంలోకి దిగిన పేర్ని నాని..*

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పేర్ని నాని బీచ్ వద్దకు
గాలింపు చర్యలను నాని పర్యవేక్షించారు.

గల్లంతైన నవీన్ స్నేహితులతో మాట్లాడి ఎలా గల్లంతయ్యాడనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టినా నవీన్ ఆచూకీ తెలియరాలేదు.

సమయాభావం కావటంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపి వేశారు.

రేపు తిరిగి గాలింపు చర్యలు చేపడతామని పోలీసు వర్గాలు తెలిపాయి.

కాగా బీచ్ వద్ద భద్రతా వైఫల్యం ఈ ఘటనతో పొట్టొచ్చినట్టు తెలుస్తోంది.

*ఇటీవలి కాలంలో* సముద్రంలో గుంతలు ఏర్పడి స్నానాలకు అనుకూలంగా లేదు.

ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

పౌర్ణమి ఈ నెల 8వ తేదీన అయినప్పటికీ ఈ రోజు ఆదివారం, రేపు కార్తీక సోమవారం కావటంతో భక్తులు వేలాదిగా బీచ్ కు వస్తున్నారు.

సముద్రంలో ఎక్కువ లోతుకి ప్రజలను వెళ్లనీయకుండా నిరోదిస్తున్నామన్న అధికారుల ప్రకటనలు ఈ ఘటనతో గాలిలో కలిసిపోయాయని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *