గన్నవరం
గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ శివారులో అప్పారావు పేట వద్ద గుడివాడ నుంచి గన్నవరం వచ్చు ఆర్ టి సి బస్సు టైరు పగలగా డ్రైవర్ బస్సును చాకచక్యంగా కరెంటు స్తంభాన్ని తప్పించి రోడ్డు పక్కన ఉన్న రేలింగ్ ను గుద్దుకొని బస్సును ఆపాడు. ఆ సమయంలో బస్సులో 50 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ప్రయాణించే వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ క్షేమంగా ఉన్నారు.