Breaking News

కృష్ణా జిల్లా పోలీస్ కు రెండు విభాగాలలో జాతీయ స్థాయి ప్రతిష్టత్మాక ”SKOCH AWARD” పురస్కారాలు.

కృష్ణా జిల్లా, మచిలీపట్నం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా సంరక్షణ లక్ష్యాల మేరకు, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ పోలీస్ ప్రణాళికలకు అనుగుణముగా కృష్ణా జిల్లా పోలీస్ చే రూపొందించబడిన “OPERATION HAWK మరియు CYBER WING” ప్రాజెక్టులని వరించిన జాతీయ స్థాయి SKOCH AWARDS పురస్కరాలు.ప్రజల జీవితాలని మరియు యువత భవిష్యత్తుని అంధకారములోకి నెట్టివేస్తున్న గంజాయి మరియు నాటు సారా మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలని నిరోధించడానికి ప్రత్యేక ప్రణాళికలతో రూపొందించిన “OPERATION HAWK” ని వరించిన SKOCH AWARD సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలో నూతన దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా పోలీస్ – అదే విభాగాముకి చెందిన DISTRICT CYBER WING ప్రాజెక్ట్ ని వరించిన SKOCH AWARD.దేశంలో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్ధాయి అవార్డులలో ఒకటి అయిన SKOCH అవార్డును వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి మరియు వారి యెక్క సేవలకు గుర్తింపుగా SKOCH అవార్డును ఎంపిక చేయడం జరుగుతుంది. ముందుగా దేశములోనే వివిధ రంగాలలోని ప్రాజెక్టులను నామినేషన్ కు ఎంపిక చేసి, అనంతరం వాటిలో కొన్నింటిని అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అవార్డుకు నామినేషన్ నిమిత్తం కృష్ణా జిల్లా పోలీస్ తరపున 1. OPERATION HAWK మరియు DISTRICT CYBER WING అనే ప్రాజెక్ట్స్ ని నామినేషన్ కు పంపించడం అయినది. కృష్ణా జిల్లా పోలీస్ తరపున పంపిన సదరు ప్రాజెక్టులను SKOCH అవార్డు జ్యూరీ సభ్యులు ఆమోదించడం జరిగింది. సదరు రెండు ప్రాజెక్ట్స్ SKOCH AWARD ని కైవసం చేసుకుని కృష్ణా జిల్లా పోలీస్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంపొందించడం జరిగింది.

 OPERATION HAWK (Anti Smuggling Surveillance Grid): OPERATION HAWK అనేది అక్రమ రవాణా నిరోధించడానికి, అనుమానితులను మరియు అలవాటుపడిన నేరస్తులపై నిఘా ఏర్పాటు చేసి వారిని పర్యవేక్షించడం కోసం తీసుకోబడిన చర్య. అక్రమ రవాణా అరికట్టుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వారిచే అనేక నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. వాటికి అనుగుణంగా బోర్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం, మొబైల్ పార్టీస్ తో గస్తీలు నిర్వహించడం, జాతీయ రహదారులపై, రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ దాడులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారే స్వయంగా కొల్లేరు లోకి నాటు పడవలు సహాయంతో వెళ్లి వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 1,000 లీటర్ల నాటుసారా, పడవలు మరియు సారా బట్టి పాత్రలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమ రవాణా మరియు నాటుసారా తయారీకి పాల్పడేవారిపై బైండోవర్, పి.డి యాక్ట్ కేసులు నమోదు చేయడం, సస్పెక్ట్ షీట్లు తెరవడం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందనివ్వకుండా చేయడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు గతంలో అక్రమ రవాణా మరియు నాటు సారా తయారీకి పాల్పడి వివిధ కేసులలో ముద్దాయిలుగా ఉన్న 2,500 మందికి విజయవాడలో యాంటి స్మగ్లింగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి ముందుగానే హెచ్చరించడం జరిగింది. అయిననూ కొంతమందిలో మార్పు రాకుండా తరచూ అక్రమ రవాణా మరియు నాటుసారా జోలికి వెళ్లే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. అదేవిధంగా జిల్లా బహిష్కరణ కు సైతం రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ విధంగా “ఆపరేషన్ హాక్ ” ద్వారా కృష్ణా జిల్లా పోలీస్ అక్రమ రవాణాకు మరియు నాటుసారా తయారీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతూ కట్టడి చేయడం జరుగుతుంది.

 KRISHNA DISTRICT CYBER WING : DISTRICT CYBER WING అనే ఒక ప్రత్యేక విభాగాన్ని శక్తివంతంగా తయారుచేసి పౌరులకి సైబర్ నేరాల నుండి రక్షణ కల్పించే దిశగా అడుగులు వేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ సైబర్ బాధితులకి న్యాయం చెయ్యడానికి , సైబర్ సెక్యూరిటీ మరియు సైబర్ చట్టాల ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి, సైబర్ క్రైమ్ దర్యాప్తులో పనితీరును మెరుగుపరచడానికి మరియు సైబర్ నేరాల్లో స్పీడ్ మరియు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయు నిమిత్తం మరియు సాధారణ నేరాలలో సైతము సాంకేతిక పరిజ్ఞానము వాడి పటిష్టమైన దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక విభాగం. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను పెంపొందించడం, సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ మరియు ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ గురించి అవగాహన పెంచుకోవడం, స్టేషన్ స్థాయిలో ప్రత్యేక ఐటి మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగిన సిబ్బందిని తయారు చేయడం, సైబర్ నేరస్థులని సమర్ధవంతముగా ఎదుర్కోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని నిమిత్తం సైబర్ వింగ్, కంప్యూటర్ లాబ్ లను నవీనకరించి, శిక్షణా తరగతులు నిర్వహించి సైబర్ చట్టాలపై అవగాహన కల్పించడం, సైబర్ నేరాలను ను త్వరితగతిన ఛేదించడానికి, బాధితులకు తక్షణ న్యాయం అందించడానికి “ఈచ్ వన్ – టీచ్ వన్” కెపాసిటీ బిల్డింగ్ ఫర్ బెటర్ పోలీసింగ్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో ఐటి కోర్ సిబ్బందికి 40 రోజులు శిక్షణ ఇచ్చి టెక్నికల్ సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, సైబర్ నేరాల్లో దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత యంత్రాంగాన్ని ప్రవేశ పెట్టడం, ప్రజాసేవలలో పరదర్శకత కోసం ఈ ఆఫీస్ ను ఉపయోగిస్తూ సమయాన్ని, డబ్బును ఆదా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కృష్ణా జిల్లా పోలీస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం (CCTNS), ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ITSSO), ఇంటరోపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ICJS), ఎస్సీ & ఎస్టీ అట్రాసిటీ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టం, గ్రేవ్ ఎకనామిక్ అండ్ సైబర్ అఫెన్సెస్ ట్రాకింగ్ సిస్టం (GECO), మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (MSCD) మరియు E-OFFICE లలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా పోలీస్ మొదటి స్థానంలో నిలిచి చార్జిషీట్లను నిర్ణీత సమయంలో ఫైల్ చేయడం, నేరం జరిగిన అతి తక్కువ సమయంలోనే విచారణ పూర్తిచేసి ఆన్లైన్ చేయడం, తద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చేయడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *