Breaking News

కొడాలి నానిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఉమా

విజయవాడ:

మంత్రి పదవి పీకినా రోషం లేని వెదవ కొడాలి నాని.

సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసి..!

పౌరుషం లేని నువ్వు మూసుకు కూర్చో.!!

నువ్వంట్రా.. చంద్రబాబు, పవన్ గురించి మాట్లాడి యూసిలెస్ ఫెలో..!_

కొడాలి నానిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఉమా

చేతికాని వాడవని దద్దమ్మవని పనికిమాలిన వాడివని అవినీతి పరూడవని నీ మంత్రి పదవిని జగన్ పీకేసినా.. నీకు సిగ్గు లేకుండా మాజీ సీఎం చంద్రబాబు గురించి, పవన్ కల్యాణ్ గురించి 420 మాటలు మాట్లాడతా వెదవా అని మాజీమంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నానిపై ఫైర్ అయ్యారు. ఐదేళ్లు మంత్రిగా నేను ఉన్నప్పుడు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకున్న నువ్వు ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. తప్పుడు కేసులకు, ఎస్సీ, ఎస్టీ కేసులకు చావుకు రేవుకు తెగించి ఉన్నారు టీడీపీ కార్యకర్తలన్నారు.సన్నబియ్యం, డబ్బాబళ్లు ఏమయ్యాయన్నారు. బియ్యం కాకినాడ పోర్టుకు వెళుతున్నాయని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్యాక్టరీ అమ్మకం గురించి, రైల్వే జోన్ గురించి, కడప స్టీల్ ప్యాక్టరీ గురించి ప్రధాని మోదీ వద్ద మాట్లాడే ధైర్యం నీ సీఎం జగన్ కు ఉందా ? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా? గుడివాడలో ఉన్నావా? ఎవరి పొలికల్ టూరిస్టులో ప్రజలందరికీ తెలుసునన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచుతుందా ? మాకు తెలియని విషయాన్ని నువ్వు చెబుతావా. వివేకానంద రెడ్డిది గుండె పోటో, గొడ్డలి పోటో మాట్లాడే దమ్ము నీకుందా? అన్నారు. కుప్పం సంగతి మీకెందుకు పులివెందుల్లో జగన్ ఓటమి ఖాయమన్నారు.టీడీపీ అధికారంలోకి రాగానే 24 గంటలు తిరగకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అపేరునే పెడతామన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కొడాలికి లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *