Breaking News

గీత కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

విజయవాడ

గీత కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కల్లు గీత పాలసీని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలో గీత కార్మికులకు చెందిన సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని, గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, ఈత, శ్రీ శయన కులాలకు చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నిర్ణయం వలన చాలా మేలు జరుగుతుందని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కల్లు దుకాణాల అద్దెలను (కిస్తిలును) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం, గీచేవానికే చెట్టు పధకం, షెడ్యూల్ ప్రాంతాలలో షెడ్యూల్ జాతులు వారు కల్లు గీసుకోవడం కోసం ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వడం, బలహీన వర్గాల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్త శుద్దికి నిదర్శనం అని మంత్రి సంతోషం వ్యక్తం చేసారు.

ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచటం, ప్రమాదానికి గురి అయి అంగ వైకల్యం చెందిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం, కల్లుగీత కార్మికుడు సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి 5 లక్షలు రూపాయలు భీమా కింద అందచేయడం, నదీ తీరాలు, కాల్వగట్లు, మీద తాటి, ఈత చెట్ల ను పెంపకం చేసీ వాటి ద్వారా కార్మికులకు మరింత ఆదాయంవచ్చే విధంగా ఇదు సంవత్సారాల పాలసీని తీసుకురావటం చాలా మంచి నిర్ణయం అని మంత్రి పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా జరగని విధంగా కల్లుగీత కార్మికుల కోసం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని, కల్లు గీత కార్మికుల కుటుంబాలు అన్ని ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని మంత్రి శ్రీ జోగి రమేష్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *