తెలుగుదేశం పార్టీ మహిళా నేత గౌతు శిరీషకు సోషల్ మీడియా పోస్ట్ పేరుతో వేధింపులకు గురి చేసేందుకు సి ఐ డి నోటీసు ఇవ్వడంతో మంగళగిరిలోని సి ఐ డి కార్యాలయానికి వచ్చిన గౌతు శిరీష కు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతుగా నిలిచారు. కార్యాలయం వద్ద దేవినేని ఉమ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష ను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని శిరీష గారి పై వైసీపీ నేతలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు నేడు విషయం చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని గౌతు శిరీష ని వదిలిపెట్టే వరకు ఇక్కడ నుండి వెళ్లే ప్రసక్తే లేదని దేవినేని ఉమ అక్కడే ఉన్నారు. సి ఐ డి ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. మొదట ఇచ్చిన నోటీసులో మంగళగిరి సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హాజరు అయ్యేందుకు గౌతు శిరీష సీఐడీ కార్యాలయానికి రాగా.. మళ్ళీ సీఐడీ అధికారుల నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మంగళగిరి కార్యాలయం కాదు.. గుంటూరు కార్యాలయానికి రావాలని తిరిగి సూచించారు. ఆమెతో పాటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.