నందిగామ నియోజకవర్గం నందిగామ శ్రీకారం కళ్యాణ మండపం నందు నందిగామ నియోజకవర్గ వై.యస్.ఆర్.సీపీ ప్లీనరీ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు.ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోంది అని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజురోజుకూ జనాదరణ పెరుగుతోంది,దీనిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నారని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు,కష్టాలు పడ్డారు అని,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టింది అని,వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేస్తోంది. అని,పేద పిల్లల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పైన దుష్ప్రచారం చేస్తున్నారని,నేడు శ్రీకాకుళం జిల్లాలో వరుసగా మూడో ఏడాది అమ్మఒడి నగదు క్రింద 82,31,502 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరిగింది,ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయాలకు 8నెలల జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది.చంద్రబాబు పాలనలో పోషణం పథకానికి ఐదు వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అలాంటిది మన ప్రభుత్వం వైఎస్సార్ పోషణం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నది అని తెలిపారు,అదేవిధంగా ఒకసారి ప్రజలందరూ నాడు చేసిన పనులను నేడు చేసిన పనులను దృష్టిలో ఉంచుకొని మీ అందరి కోసం నిరంతరం కష్టపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.