అమరావతి:
తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సచివాలయానికి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఏబీవీ గతంలో సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ ఏప్రిల్ 29న సచివాలయానికి వెళ్లారు. తన సస్పెన్షన్ ఎత్తివేస్తూ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందజేశారు. పోలీసు డైరెక్టర్ జనర. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ప్రాసెస్‌లో పెడతామని చెప్పిన సీఎస్.. ఏబీవీ అక్కడ ఉండగానే సచివాలయం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.