Breaking News

లక్షరూపాయలు ఇస్తే పాస్ చేస్తామ: కృష్ణ యూనివర్సిటీ

మచిలీపట్నం:

2015 నుండి 2019 వరకు అన్ని సబ్జెక్టులను ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయం వారు కావాలనే నన్ను పాస్ చేయకుండా అడ్డుకుంటున్నారు.లక్షరూపాయలు ఇస్తే పాస్ చేస్తామని అప్పటి వి.సి సుందరక్రిష్ణ డిమాండ్ చేసినట్లు విద్యార్ధి అభియోగం.మచిలీపట్నం దేశాయిపేట కు చెందిన బడే లోకేష్ (సిటీ కేబుల్ యజమానికి స్వయానా మేనల్లుడిని అని చెప్పుచున్నాడు) కృష్ణా యూనివర్సిటీ ముందు నిరాహారదీక్ష చేయుచున్నాడు.నాకు న్యాయం జరిగేవరకు ఇక్కడినుండి కదిలే ప్రసక్తి లేదని, అందుకోసం నాప్రాణాలైన అర్పిస్తానని తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు.కృష్ణా యూనివర్సిటీ తన జీవితాన్ని నాశనం చేసిందని ఇక్కడి మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తే చదువు రాని వాడిని కూడా పాస్ చేస్తుందని, ఎంత బాగా చదివే విద్యార్ధి అయినా డబ్బులు చెల్లించకుంటే వారి జీవితం కావాలనే నాశనం చేస్తారని బాదితుడి ఆరోపణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *