కృష్ణాజిల్లా: గన్నవరం
గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఐఎస్ బీ చదువుతున్న ఈయన మూడో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు రెండ్రోజుల కిందటే పంజాబ్ రాష్ర్టంలోని మొహలి క్యాంపస్ కు వెళ్లిన వంశీ మంగళవారం తరగతిలో ఉండగా ఎడమ చెయ్యి లాగుతున్నట్లు అన్పించడంతో మొహలీలోని ఎస్ ఏ ఎస్ నగర్ లో ఉన్న సోహానా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారని సమాచారం.