Breaking News

వాటర్ ప్లాంట్లపై ఎంక్వైరీ చేయండి.. తాసిల్దార్ లకు .ఆర్ డి ఓ.ఆదేశాలు

మచిలీపట్నం :

అనధికార వాటర్ ప్లాంట్లపై ఎంక్వైరీ చేయండి.. తాసిల్దార్ లకు ….ఆర్ డి ఓ.ఆదేశాలు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నీరు సరఫరా చేస్తున్న అనధికార వాటర్ ప్లాంట్లపై తక్షణమే విచారణ జరిపించి రిపోర్టులు సమర్పించాలని మచిలీపట్నం, గూడూరు తాసిల్దార్లు ని ఆదేశిస్తూ మచిలీపట్నం ఆర్.డి.ఓ. ఎల్. కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆర్డిఓ స్పందించారు.మచిలీపట్నం గూడూరు మండల లో ఏ విధమైన లైసెన్సులు, లేకుండా ల్యాబ్ లు నిర్వహించకుండా అనధికారికంగా వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను తయారుచేసి ప్రజల ఆరోగ్యాన్ని భంగపరిచే చర్యలకు పాలు పడుతున్నారని బాలాజీ ఫిర్యాదు చేశారు. అక్రమంగా తయారు చేసే వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పై దొంగ అడ్రస్ లు ముద్రించి మార్కెట్లో విక్రయిస్తునరని బాలాజీ తెలియజేశారు.ఫుడ్ కంట్రోల్,మున్సిపల్, పంచాయితీ ఇతర ప్రభుత్వ అధికారుల నుండి పొందవలసిన లైసెన్సులు పొందకుండా, టెక్నీషియన్స్ లేకుండా ఐ.ఎస్.ఐ. లైసెన్స్లు లేకుండా ప్యాకేజీ వాటర్ ప్యాకెట్లు, ప్యాకేజీ వాటర్ బాటిల్స్ చేయటం చట్టరీత్యా నేరం అని బాలాజీ పేర్కొన్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎ విధమైన పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ విచ్చలవిడిగా అనధికార వాటర్ ప్లాంట్స్ నిర్వహించడం, అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని బాలాజీ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇటీవల ఎన్టీఆర్ కృష్ణాజిల్లాలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనధికార వాటర్ ప్లాంట్స్ పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయమని బాలాజీ అన్నారు.వాటర్ ప్లాంట్ ల నిర్వహణకు కు, 20 లీటర్ల వాటర్ క్యాన్ల లో సరఫరాకు ఎట్టి అభ్యంతరం లేదని, అయితే అందుకు కావలసిన లైసెన్సులు మంచినీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, చట్ట ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు.ఇప్పటికైనా మచిలీ పట్నం,గూడూరు తాసిల్దారులు స్పందించి అనధికార వాటర్ ప్లాంట్లను తక్షణమే మూసివేయాలని వడిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తక్షణమే స్పందించినందుకు మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ కు ప్రజల తరఫున లంకి శెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *