కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధి 18 గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం ఆలమూరు మండల తెలుగుదేశం నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రెండోదశ ఉదృతిలో పార్టీకి వెన్నెముకలో ఉండే పలువురు నాయకులని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని ఆయన అన్నారు. రాయుడు సూరిబాబు, గెద్దాడ నారాయణమూర్తి, గన్ని నరసింహమూర్తి, నామాల నారాయుడు మరికొందరు సీనియర్ నాయకులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఎవరు అధైర్య పడొద్దని ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అన్ని విధాల అండగా ఉంటామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, దండంగి రామారావు, ఈదల సత్తిబాబు, ఈదల నల్లబాబు, వంటిపల్లి సతీష్, గుత్తుల శ్రీను,తాడి శ్రీనివాస్ రెడ్డి, గొడవర్తి బాబి, గుడాల ప్రభాకర్‌రావు, ఆకుల రామకృష్ణ, నైనాల శ్రీరామచంద్రమూర్తి, నాగిరెడ్డి వెంకటరత్నం, సలాది నాగేశ్వరరావు, భావన శ్రీను, కొమ్ము నారాయుడు, కోన శ్రీనివాస్(దత్తుడు) కొత్తపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మారుతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు._ నవీన్ కుమార్ కొత్తపేట నియోజకవర్గం