Breaking News

టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు

 కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

ఆ మె మృతి వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైను ఆమె ఏ లోకంలోఉన్న ఆమె పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ.. మా అభిమాన నటుడు కృష్ణ గారు మహేష్ బాబు గారికి మనోధైర్యం కల్పించాలని భగవంతుని వేడుకుంటున్నాను.4 గంటలకి ఉదయం మృతి చెందారు.ఈరోజు 4కి మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరుగును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *