హైదరాబాద్:
తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ఉద్యోగాల దరఖాస్తు గడువును సైతం పొడిగించింది. వయోపరిమితి పెంచడంతో మరికొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.