తెలంగాణ
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అభిషేకం సేవ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.