సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 71 రైళ్లను నిలిపివేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. రైల్వే జీఎం అత్యవరసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తిగా రైల్వే శాఖ రద్దు చేసింది. జంట నగరాల్లోని పలు రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కాజీపేట, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులను లోపలికి అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారులన్నీ మూసేశారు. బస్సులను సైతం స్టేషన్ వైపునకు అనుమతించడం లేదు.