Breaking News

తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు

కృష్ణాజిల్లా గుడివాడ 

గుడివాడ పెద్ద వీధి సంఘం పాఠశాల వద్ద జనావాసాల మధ్య వ్యభిచార గృహం నిర్వహిస్తుండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు గుడివాడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేద ,మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే పెద్దవిది సంఘం పాఠశాల వద్ద ఒక యువతి కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తుండడంతో తాము అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికరాలు పప్పు దుర్గ ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లపైనే మద్యం సేవిస్తూ విటులు వస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే తమను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూన్నారని ఎం.జ్యోతి చెప్పారు. పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా పోలీసులు స్పందించకుంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని మహిళలు మీడియాకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *