Breaking News

వెంకటిగిరి చేనేత చీర ——

01 (1) 01 (2) 01 (3) 01 (4) 01 (5) 01 (6) చీరకు విశిష్ట ప్రాధాన్యత ఉంది . మారుతున్న కాలానికి అనుగుణంగా మగువ మనుసు దోచుతున్న వేంకటగిరి చేనేత చీర మరుపురాని చేనేత చీరకు మారుపేరుగా నిలుస్తుంది .
అగ్గిపెట్టె లో పట్టే చీర దగ్గర నుంచి అద్భుతమైన డిజైన్ లతో వేంకటగిరి చేనేత చీరలు దేశ ఖ్యాతిని పొందుతున్నాయి .
చిలుకలు, తీగలు -2003 , కృష్ణ లీలలు – 2005 , బృందావనం -2015 సమ్మె ,నేత చీరలు ఇక్కడి నేతన్నలకు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టాయి .జాంధానీ వర్క్స్ ఇక్కడి ఇక్కడ ప్రతేకత . దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నైపుణ్యత అందరిని ఆకట్టుకుంటుంది, ప్రతిసంవత్సరం చేనేత రంగం లో తప్పకుండ ఒక అవార్డు వెంకటగిరి వస్తుంది . ఇక్కడి చీరలు దేశంలో నలుమూలల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయ్ . వయసుతో సంబంధం లేకుండా అందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఇక్కడ చీరలు వుంటాయి .3 తరాలు మారుతున్న ఇక్కడి చేనేత కళకు విశిష్ట ప్రాధాన్యతనిచ్చి అద్భుతమైన కళలతో జాతీయ స్థాయి అవార్డులు పొందుతున్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ” రాజుల సంస్థానం ” నాటిరాజులూ చేనేతకు విశిష్ట ప్రాధాన్యతనిచ్చేవారు . ఇక్కడి స్పెషల్ జాంధానీ వర్క్స్ ఇది రెండు వైపులా ఒకేలాగా వుంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా ఇక్కడి నైపుణ్యత అందర్నీ ఆకట్టుకుంటుంది. చీర తయారీ విధానము ప్రతి లో గల గింజలను తొలగించి ప్రతి లో గల మలినాలను చేప దంతములు ద్వారా శుభ్రం చేసి ఏకుట , ఏకిన పతిని స్థూపాకారంగా చుట్టి రాట్నం ఉపయోగించి దారం తీస్తారు. దారాలను గంజిని ఉపయోగించి గట్టిదనం తెచ్చి సరిచేసి తదుపరి మగ్గంతో చీరను నేస్తారు . ఒక చీర నెయ్యాలంటే సుమారు 30 రోజులనుంచి, 60 రోజుల వరకు పడుతుంది. వీటి విలువలు సుమారు 20 వేల నుంచి, 70 వేలు వరకు వున్నాయి . వెంకటగిరిలో సుమారు 10 వేలు మగ్గాలు వుంటాయి , ఇక్కడ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి , అందులో 5 అవార్డులు ఒకే కుటుంబంలోనే వచ్చాయి , దేశంలోనే వేంకటగిరి 13 అవార్డులతో ప్రముఖ స్థానంలో ఉందని అందులో ఒకే కుటుంబంలోనే 5 అవార్డులు రావడం మాకు చాల గర్వకారణంగా వుందని వేంకటగిరి పట్టణంలో కట్టెల వీది లోని చేనేత కుటుంబం తెలిపింది . రాధాకృష్ణులు , గోవర్ధనగిరి ,3 ఆవులు , చిలుకలు , పురివిప్పిన నెమళ్ళు ,మామిడి పిందెలు మరియు మహాత్మ గాంధీ 150 వ జయంతి చిత్రాన్ని చీర పై నేయడం చాల అద్భుతం. ప్రస్తుతం వేంకటగిరి చీరలు ఢిల్లీ , చెన్నై ,ముంభై , పూణే , హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి .

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *