Breaking News

సప్తపర్ణీ

సప్తపర్ణీ
ఇది విరగబూసిన ఏడాకుల పొన్న వృక్షం. ఈ సీజన్లో ఎక్కడ చూసినా ఈ వృక్షాలు విరగబూసి కనిపిస్తాయి. సంస్కృతంలో సప్తపర్ణీ అని పిలిచే ఈ వృక్షం శాస్త్రీయ నామం Alstonia scholaris. ఆల్ స్టన్ అనే శాస్త్రవేత్త పేరిట దీనిని అలా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ వృక్షాల కలపను బడిపిల్లలు రాసుకునే పలకలు తయారు చేయటానికి వాడేవారట. అందుకే దీని శాస్త్రీయ నామం లో స్కాలరిస్ ( scholaris) అనే శబ్దం వచ్చి చేరింది. దీని
పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి. కాయలు బారుగా తీగల్లా ఉంటాయి. ఈ వృక్షాన్ని ఆంగ్లంలో డెవిల్స్ ట్రీ ( Devil’s Tree) అంటారు. రాత్రి వేళలలో ఈ చెట్లు గుబురుగా జడలు విరబోసుకున్న దెయ్యాలలా కనిపిస్తాయనో ఏమో దీనిని దెయ్యపు చెట్టు అనడం. ఎపోసైనేసీ ( Apocynaceae) కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ఆంగ్లంలో Blackboard Tree అని కూడా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ లోని బోల్పూర్ ( శాంతినికేతన్) లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాల సందర్భంగా పట్టాలు స్వీకరించే స్నాతకులకు ప్రధానమంత్రి ( ఆ విశ్వవిద్యాలయం ఛాన్సెలర్) పట్టాలతో పాటు ఈ సప్తపర్ణీ వృక్షం యొక్క రెమ్మలను కూడా ఇవ్వటం ఆనవాయితీ అయింది. అనాదిగా రాచపుండు ( Scrofula) కు ఏడాకుల పొన్న దివ్యౌషధంగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. విడవకుండా అయ్యే నీళ్ల విరేచనాలను అరికట్టే గుణం ఈ వృక్షం ఆకుల రసానికి ఉంది. ఋతురక్త స్రావాన్ని దీని ఆకుల రసం అరికడుతుంది. ఈ వృక్షానికున్న ఇతర వైద్యపరమైన ప్రయోజనాల కోసం నా కాలరేఖలోకి వెళ్ళి గతంలో ఈ వృక్షం మీద నేను రాసిన వ్యాసాలు చదవండి. వస్తు గుణ దీపిక ( Materia Medica) తిరగేయండి. లేకపోతే నేనిచ్చిన శాస్త్రీయ నామం సాయంతో గూగుల్ లో వెదకండి.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *