Breaking News

*క్రీ.శ – క్రీ.పూ లాగా చంద్రబాబుకు పూర్వం చంద్రబాబు శకం*

*క్రీ.శ – క్రీ.పూ లాగా చంద్రబాబుకు పూర్వం చంద్రబాబు శకం*

chandra babu (1) chandra babu (2) chandra babu (3)

ముఖ్యమంత్రులంటే ఏసీ గదులకే పరిమితం. శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు, పెళ్లిళ్లకు మాత్రమే జిల్లాలకు వెళ్లేవారు. మహా అయితే ఐదేళ్లలో ఒక్కోజిల్లాకు 2-3 సార్లు మించి వెళ్లేవారు కాదు. జనసామాన్యంలో సంచరించేవారు కాదు. కష్టాలు వస్తే హెలికాఫ్టర్లో తిరిగే వారు, ఏరియల్‌ సర్వే చేసేవారు. ఇవన్నీ చంద్రబాబు అనే వ్యక్తి సీఎం కాకముందు.

బాబొచ్చాకా జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు, ప్రజల వద్దకు పాలన, ప్రజలతో ముఖ్యమంత్రి, డ్వాక్రా వంటి కార్యక్రమాలు పెట్టి నిత్యం, నిరంతరం జనం జనం జనం ఇదే జపం. జనానికి కష్టాలొస్తే కండోలెన్స్ మెసేజ్‌లు పంపి ఊరుకునే మనిషి కాదితను. విశాఖకు ప్రళయం వచ్చినప్పుడు చూశారు కదా..పోయి పదిరోజులు బస్సులో పడుకుని ప్రజల మధ్య ఉండి వారికి ధైర్యాన్నిచ్చి, పనిచేసే ఉద్యోగులకు చేదోడుగా ఉండి మార్గదర్శనం చేశాడు.

పుష్కరాలు వస్తే సీఎంలు వెళ్లి స్నానం చేసొస్తారు ఓ శుభముహుర్తాన. ఈ మనిషి అలా కాదు. రెండు నెలల ముందు పరివాహిక ప్రాంతం అంతా ప్రతి ఘాట్‌ తిరిగి నాణ్యత చూస్తాడు. అర్థరాత్రుళ్లు బస్టాండ్‌, రైల్వేస్టేషన్లకు వెళ్లి యాత్రికులకు సెండాఫ్ ఇచ్చి వస్తాడు.

పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు కుదుర్చుకోవటానికి పారిశ్రామికవేత్తలు వస్తే పార్కర్‌ పెన్ను చేత్తో పట్టుకుని ఫైళ్లపై సంతకాలు పెడుతున్నట్టు కెమెరాల వైపు చూస్తూ నాలుగు ఫోటోలు దిగి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయేరకం కాదు. తన కారులో ఎక్కించుకుని విమానాశ్రయానికి వెళ్లి బై..బై చెప్పి వచ్చే రకం ఈయన.

ఉత్తరాఖండ్‌లో మహా ప్రళయం వచ్చి వేలమంది మనుషులు చచ్చిపోతే ప్రభుత్వాలు దిక్కులు చూస్తుంటే ఆయన సీఎం కాకపోయినా, అధికారం జనం ఇవ్వకపోయినా లోపల అసలు మనిషి అనే వాడు తొలిచేస్తాడు కదా. ప్రజలు కష‌్టంలో ఉంటే చేస్తూ ఉండటమే తప్ప చూస్తు ఉండటం చేతకాని వాడు కదా!

పార్టీ డబ్బులతో విమానాలు అద్దెకు తీసుకున్నాడు ముందు సీట్లో కూర్చున్నాడు. ఉత్తరాఖండ్‌ పర్వతశ్రేణుల్లో ఇరుక్కుపోయిన ప్రజలను (ఎందరో తెలంగాణ వాళ్లు ఉన్నారు) తరతమ బేధాలు లేకుండా అందరినీ అక్కడ్నుంచి ఢిల్లీకి తెచ్చి మంచి భోజనం, బట్టలు ఇచ్చి మరో విమానంలో హైదరాబాద్‌ తీసుకువచ్చి అక్కడ్నుంచి అందరికీ ఇన్నోవా కార్లు పెట్టి వారి వారి ఊర్లకి పంపించిన రియల్ లీడర్.

ప్రభుత్వం కూడా అలా చేయలేదు.

ప్రజలంటే పిచ్చి నిలువెల్లా ఎక్కించుకున్న వ్యక్తి.
వర్క్‌ హాలిక్‌.
పని వ్యసన పరుడు.
రాష్ట్రం, ప్రజల కోసం అందరికంటే బెటర్‌గా నేనేం చేయగలను?
అనే ఆలోచిస్తాడు.
వరదలు, తుఫాన్లు, భూకంపాలు, అంతర్జాతీయ ఈవెంట్లు, జాతీయ ఈవెంట్లు, పుష్కరాలు సందర్భం ఏదైనా, అంతకుముందు ఎంతమంది వాటిని చేసినా నేను బెస్ట్‌ అనిపించుకోవటం కోసం, పరఫెక్షన్‌ కోసం నిద్రహారాలు మాని పనిచేస్తాడు. ఆయనకి తెలుగు డిక్షనరీలో నచ్చని పదాలు *రాదు, తెలియదు, అవదు.*

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *