Breaking News

ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే.

సలేశ్వర క్షేత్రం.

02 (1) 02 (2) 02 (3) 02 (4) 02 (5)

👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే.
👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?
గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే!
కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది.
ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు.
మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే.
ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు.
అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.
అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.
గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.
ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?
అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము.
ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం,
చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం,
ఆధ్యాత్మిక ప్రదేశం.
ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము.
ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది.
ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది.
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది.
అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.
ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు.
ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది.
ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !
👉1. ఆలవాలం.
అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు,
ప్రకృతి రమణీయదృశ్యాలు,
అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది.
దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.
👉2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.
తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే.
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది.
అక్కడినుంచి 32కిమీ ల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.
👉3. జాగ్రత్త.
గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి.
ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి.
గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.
👉4. లోయలో జాగ్రత్తగా నడవాలి.
గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది.
ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.
👉5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.
గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది.
తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం
👉6. లింగమయ్య స్వామి లింగం.
గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి.
పై గుహనే ముందు చేరుకోవచ్చు.
ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది.
స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు.
క్రింద గుహలో కూడా లింగమే ఉంది.
గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.
👉7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది.
ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు ‘వత్తన్నం వత్తన్నం లింగమయ్యో’ అంటూ వస్తారు.
వెళ్లేటప్పుడు ‘పోతున్నం పోతున్నం లింగమయ్యొ’ అని అరుస్తూ నడుస్తుంటారు.
👉8. శిధిలావస్థ.
10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి.
నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు.
అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు.
👉9. నడకదారులు.
ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది.
అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.
కొలను భారతి – ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!
👉10. చైత్రపౌర్ణమి.
సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది.
చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు.
ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.
👉11. జలపాతాలు.
ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది.
పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు.
అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
👉12. భక్తులతో కిటకిటలాడుతూ.
నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు.
గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు.
ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
👉13. చరిత్రకారులు.
సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు.
13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు.
ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది.
17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.
👉14అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం.
వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు.
అదిప్పుడు శిథిలావస్థలో వుంది.
ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు.
అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.
👉15. ఎలా చేరుకోవాలి.
హైదరాబాద్ – శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది.
అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే … సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది.
ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే … సలేశ్వరం లోయ కనిపిస్తుంది.
అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి.
లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే … ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి.
అదే సలేశ్వర క్షేత్రం.
నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది.
అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు.
అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.
ఓం నమః శివాయ..

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *