Breaking News

ఒంటిమిట్ట శ్రీరాముడి కల్యాణం పున్నమి రోజునే ఎందుకు చేస్తారు..?

కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీరాముడి కల్యాణం
పున్నమి రోజునే ఎందుకు చేస్తారు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాద్రి రాముడిదే వైభోగం అంతా… పట్టుబట్టలు తలంబ్రాలు సమర్పించేది ఆయనకే…. కాని రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా, ఏ దేవాలయాన్ని ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచించి కడపలోని ఒంటిమిట్టను ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా ప్రకటించింది. ఎంతో చారిత్రక వైభోగం గల ఒంటిమిట్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంతగా ప్రాశస్త్యం పొందలేదు…. కాని భద్రాద్రికి మించిన స్థల పురాణం ఒంటిమిట్టకు ఉందని పండితులు తెలుపుతున్నారు.

శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.
జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయ విగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారి పేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగర వాస్తు శైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో ఉండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్ర కవి ఈ ప్రాంతానికి చెందిన వాడేనని తెలుస్తోంది. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.

పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిల్లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఒంటిమిట్టలో రాత్రిపూట పండువెన్నెల్లో నిర్వహిస్తారు. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు. కడపజిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఈ నెల పదో తేదీన సీతారామ కల్యాణాన్ని రాష్ట్ర మహోత్సవంగా జరపనున్నారు.

++++++++++++++

రాములోరి
కల్యాణంణం
చూతమురండి

నేడు ఒంటిమిట్టలో కల్యాణోత్సవం
రాత్రి 8-10 మధ్య ముహూర్తం

కడప: కోదండరామయ్య కల్యాణానికి కడప జిల్లాలోని ఒంటిమిట్ట ముస్తాబయింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం జరిగే సీతారామ కల్యాణ మహోత్సవానికి ఏకశిలానగరి సిద్ధమైంది.. జానకిరాముడి వివాహ వైభోగాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం ఉవ్విళ్లూరుతుండగా.. ఈ ఏడాది అట్టహాసంగా కల్యాణాన్ని నిర్వహించాలని తితిదే సంకల్పించింది. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు భక్తులకు వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేసవి.. ఎండలను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయనుండగా.. భోజన సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. సోమవారం రాత్రి 8-10 గంటల మధ్య సీతారామ కల్యాణం జరగనుంది. ఇక్కడ 70 ఎకరాల్లో కల్యాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదిక వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్న వారు సైతం తిలకించేందుకు వీలుగా భారీ ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షప్రసారాన్ని ఇవ్వనున్నారు. పుష్పాలంకరణలో ఆలయం, కల్యాణ వేదిక పరిసరాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. ఆదివారం నుంచి భక్తులరాకతో ఆలయంలో రద్దీ నెలకొంది.

పట్టువస్త్రాలు సమర్పించనున్న మాణిక్యాలరావు!
ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ప్రభుత్వం తరఫున సోమవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి దంపతులు వీటిని సమర్పించాల్సి ఉండగా.. దిల్లీ పర్యటన కారణంగా చంద్రబాబు ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు రాములోరి కల్యాణానికి హాజరవుతారు. మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. గవర్నర్‌ నరసింహన్‌ కల్యాణోత్సవానికి హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కడపకు ప్రత్యేక విమానంలో చేరుకోనున్న ఆయన.. 7.30 గంటలకు ఒంటిమిట్ట కల్యాణవేదిక వద్దకు చేరుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓ ముత్యం.. కొన్ని తలంబ్రాలు
భక్తుల సౌకర్యార్థం స్వామివారి కల్యాణ తలంబ్రాలను పంపిణీ చేసేందుకు తితిదే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. చిన్నపాటి కవర్లలో ఒక ముత్యంతో పాటు కొన్ని తలంబ్రాలను అందివ్వనున్నారు. సుమారు లక్ష ప్యాకెట్ల వరకూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.
మోహినీ రూపంలో కోదండరాముడు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు కోదండరాముడు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పుర వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం వూంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రికి గరుడ వాహనంపై సీతారామలక్ష్మణమూర్తులను అలంకరించి వూరేగించారు.

++++++++++++++

శ్రీకోదండరామాలయం
– ఒంటిమిట్ట

శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం.త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీకోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.
జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.
అద్భుతమైన ఆలయనిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగరవాస్తుశైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.
పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.
ఎలా చేరుకోవచ్చు
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *