Breaking News

కోనసీమ అందాలూ చూడాలి అంటే రెండు కళ్ళు

తూర్పు గోదావరి :

 

ప్రశాంత వాతావరణం ,పచ్చని చెట్లు ,చిన్న చిన్న సెలయేర్లు,చుట్టూ కొబ్బరి తోటలు,మామిడి చెట్లు ..దారి పొడువునా ఎంతో అహ్లదకరమైఅన వాతావరణం,ప్రకృతి రమణీయతకు కొలువైన ప్రదేశం కోనసీమ.కోన సీమ అందాలూ చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోవు..

 

‘కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి.

 

మా అందమైన ప్రయాణం లో దర్శించిన క్షేత్రాలు :-

 

ముక్తేశ్వరం :-

 

తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరమున ఉన్న ఒక గ్రామం ముక్తేశ్వరం. చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఊరికి కొద్ది దూరంలో గోదావరి తీరం. నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు.రమణీయమైన ప్రదేశం ..దారి పొడువునా అందలే .

 

ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు శివాలయములు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మాహాత్మ్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్థల పురాణము ద్వారా తెలియుచున్నది.

 

అయినవిల్లి:-

————-

కోనసీమ అందాలూ , ప్రశాంత వాతావరణం ,పచ్చని చెట్లు ,చిన్న చిన్న సెలయేర్ల మద్య ఎంతో ఆహ్లాదకార వాతావరణం లో వెలసిన ఎంతో మహిమన్మితామైన క్షేత్రం అయినవిల్లి సిద్ది వినాయక స్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా రాజముండ్రి కి 60 కి మీ దూరం లో అమలాపురం నుండి 14 కి మీ దూరం లో ఉన్న అయినవిల్లి వినాయక దేవాలయం చాల పురాతనమైనది మరియు ప్రసిద్ది చెందినా క్షేత్రం .

 

ఇక్కడ వెలసిన స్వయం భు గణపతి అత్యంత మహిమన్మితుడు.దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం నిర్వర్తించేందుకు విగ్ననయకుడైన వినాయకుణ్ణి పూజించి పునీతుడైనట్లు క్షేత్రం పురాణం చెబుతుంది . వ్యాస మహర్షి దక్షిన యాత్ర ప్రారంబం లో ఇక్కడ గణపతి ని ప్రతిష్టించినట్లు కూడా ఒక పురాణం ఉంది . స్వామి వారి దర్శనం వలన సిద్ది బుద్ది లబిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.

 

పవిత్ర గోదావరి నది పాయ లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామి వారు దక్షినబిముఖంగా ఉండడం వలన ఇక్కడ స్వామి వారి ని దక్షిణ సింహ ద్వారం ద్వారా,తూర్పు సింహద్వారం ద్వార దర్శనం చేసుకోవొచ్చు.ఈ జిల్లా వాసులు ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ముందు ఇక్కడ విజ్ఞేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రారంబిస్తారు.అలా చేయడం వాళ్ళ అంతా మంచి జరుగుతుంది అని వాళ్ళ విస్వాశం.

ఈ ఆలయ ప్రాంగణం లో శ్రీదేవి ,భూదేవి సమేత చెన్న కేశవ స్వామి దేవాలయం

కాల భైరవాలయం,విశ్వేశ్వరాలయం,అన్నపూర్ణా దేవి ఆలయం ఉన్నాయి. క్షేత్ర పాలకుడు శ్రీ కాల భైరవ స్వామి ఈశాన్య దీషలో ప్రతిస్టించబడ్డాడు .

 

దేవాలయం లో జరుగు ప్రత్యేక కర్యాక్రమాలు :-

 

శివ కేశవులురికి వైశాక శుద్ధ ఏకాదశి నుండి పంచహిణిక దీక్ష తో కళ్యాణాలు చేస్తారు .

వినాయక చవితి,క్రిష్ణస్తామి ,విజయ దశమి ,మహా శివరాత్రికి ఉత్సవాలు చేస్తారు .

 

మురామళ్ళ

—————-

 

గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది . తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది . భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది . ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది .

 

దక్షయజ్ఞం ద్వంసంగావించి తదుపరి మహావిష్ణువు కోరిక పై దక్ష యాగం పుర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రె తలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేయించిన తారువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేదు . దేవతలందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయుటకై వైకుంటమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్తించి శాంతింప చేయమని కోరిరి . మహా విష్ణువు నరసింహ అవాతరం దాల్చి వీరభద్రుని శాంతింప చేయుటకు ప్రయత్నించిన పలితం కలగలేదు . అప్పుడు మహా విష్ణువు జరిగినదంతా బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మ కు చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తి ని ధ్యానించి గ షోడ కళ లో ఒక కళ ను భాద్రకాళి నామము తో భూలోకమునకు పంపి వీరభాద్రున్ని శాంతింప చేయుటకు ప్రయత్నించిన వీరభద్రుడు శాంతింప నందున అప్పుడు భద్రకాళి ప్రక్కనగల తటాకమునందు మునిగి భాద్రాకాలి స్వరూపం నుండి కన్య రూపమును దాల్చి వీరభద్రుడి ముందు నిలువగా అప్పుడు వీరభద్రుడు శాంతి అయ్యాడు అని అప్పుడు వారీరువురికి గందర్వ వివాహ పద్దతిన కాల్యణం జరిపించారు అని స్థల పురాణం .

 

ఆ నాటి నుండి స్వామీ వారికి గందర్వ పద్దతిలోనే కల్యాణోత్సవం జరిపిస్తారట !! అందుకే ఈ క్షేత్రం లో పెల్లిలు కాని వాళ్ళు కల్యాణోత్సవం జరిపిస్తే తొందరగా పెల్లిలు జరుగుతాయని భక్తుల నమ్మకం .

 

వెళ్ళు మార్గం :-

 

అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.

రాజముండ్రి నుండి సుమారు 71 కి మీ దూరం ఉంటుండు  ( ద్వారపూడి-యానం రోడ్ )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *