Breaking News

జ్వాలా తోరణం దర్శనానికి పోటెత్తిన భక్తులు

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రం ఆలయానికి భక్తులు పోటెత్తారు నేడు కార్తీక పౌర్ణమి ఘడియలు సమీపించటంతో శ్రీశైలం ఆలయం భక్తులతో నిండిపోయింది.కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలం ఆలయం ముందు బాగంలోని నందీ మండపం  వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని నిర్వహించారు ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థంబాలపై  నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచారు అనంతరం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు  ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద స్వామిఅమ్మావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈఓ లవన్న శ్రీశైలం ఎం.ఎల్.ఏ.శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీ లతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ శివ నామస్మరణలతో శ్రీశైలం ఆలయ మారుమ్రోగింది బారిగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునుతులైయ్యారు ఓ పక్క  జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదిమాతల్లికి వివిధరకాల హరతులిచ్చారు గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో  వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ తమ భక్తిని భక్తులు చాటుకున్నారు కాలిన ఒత్తులనుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదిటిన ధరించటం వల్ల అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు  లభిస్తాయని  భక్తుల నమ్మకం అందువలన కాలిన ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడ్డారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *