Breaking News

దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం– లడ్డూలపై ఈగలు, కీటకాలు

1c382d0e-52c2-4845-bf59-bc22a80c5522 9cb97e5e-51b4-4a0c-9b29-9ba8f1f57e1e b88693fb-f1d6-4686-84b4-427809e868f6

దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూలపై ఈగలు, కీటకాలు వాలుతున్న విషయం వెలుగుచూసింది. అధికారుల డొల్లతనంతో 50 వేల లడ్డూలు పంపిణీకి పనికి రాకుండా పోయాయి. ఓ వైపు సీఎం చంద్రబాబు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్న దుర్గగుడి సిబ్బంది మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా కనకదుర్గ దేవాలయానికి పేరుంది. భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో పురుగులు రావడం, లడ్డూలపై ఈగలు, కీటకాలు, బొద్దింకలు వాలడం సర్వసాదారణమయింది. లడ్డూల తయారి తర్వాత వాటిని ఆరబోయడానికి నిల్వ ఉంచే ప్రదేశం అపరిశుభ్ర వాతావరణంలో ఉండడాన్ని మీడియా బట్టబయలు చేసింది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *