భూ వరాహ క్షేత్రం, శ్రీమూష్నం
శ్రీ మహావిష్ణువు భారతదేశంలో 8 ప్రదేశాలలో
స్వయంభువుగా ఆవిర్భవించాడు.
1. శ్రీరంగం 2. శ్రీ మూష్నం 3. తిరుపతి
4. వానమామలై 5. సాలగ్రామం 6. పుష్కరం
7. నైమిశారణ్యం 8. బదరికాశ్రమం
భూ వరాహస్వామి స్వయంభువుగా వెలిసిన శ్రీమూష్నం పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. ద్రావిడ శైలి శిల్పకళలో నిర్మించిన ఈ ఆలయంలో వరాహ స్వామి, అతని భార్య అంబుజవల్లి తాయార్ లు కొలువై ఉన్నారు. 10 వ శతాబ్దానికి చెందిన చోళులు నిర్మించగా, తంజావూర్ నాయక్ రాజు అచుతప్ప నాయక్ విస్తరించారు. ఇప్పటికీ చెక్కు చెదరకున్నా ఉన్న సౌందర్య శిల్పాలు ఆనాటి శిల్పుల కళాత్మకత దృష్టికి, ప్రతభకు తార్కాణాలుగా నిలుస్తాయి.
ఆ పుణ్యక్షేత్రం విశేషాలు..
1. హిందూ పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలిసిన తొమ్మిది క్షేత్రాల్లో శ్రీ మూష్నం కూడా ఒకటి. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలానికి
19 కిలోమీటర్ల దూరంలో, మరో పుణ్యక్షేత్రమైన చిదంబరానికి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2. హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో ఉంచుతాడు.
భూదేవి ప్రార్థనతో కరిగిపోయిన విష్ణువు
వరాహ రూపంలో వచ్చి ఆమెను రక్షిస్తాడు.
ఇక్కడ ఉన్న అమ్మవారిని అంబుజవల్లీ పేరుతో కొలుస్తారు. విష్ణువు దశావతారాల్లో వరహావతారం రెండవది.
3. హిరణ్యాక్షుడిని యుద్ధంలో చంపిన తర్వాత సాలగ్రామ శిలలో వరాహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. యుద్ధం చేసే సమయంలో స్వామి వారి శరీరం నుంచి చిందిన చెమట వల్ల ఇక్కడ పుష్కరిణి ఏర్పడింది నమ్మకం.
దీనిని నిత్య పుష్కరిణి అని అంటారు.
నిత్య పుష్కరిణి లో స్నానం చేస్తే చర్మరోగాలు పూర్తిగా సమసి పోతాయని చెబుతారు.
4. అదే విధంగా స్వామి వారి రెండు కన్నుల నుంచి తులసి, అశ్వర్థ వృక్షం ఏర్పడినట్లు స్థల పురాణం వివరిస్తుంది.
5.అశ్వర్ధ వృక్షాన్ని పూజిస్తే
సంతానం లేనివారికి త్వరగా పిల్లలు పుడతారని నమ్మకం. ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి అశ్వర్థ వృక్షం కింద గాయత్రి మంత్రం జపిస్తే చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణకథనం.
6. స్వామివారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది.
ఇక్కడ స్వామి వారి శరీరం పశ్చిమ ముఖంగా ఉండగా ముఖం మాత్రం దక్షిణం వైపు ఉంటుంది.
7. హిరణ్యాక్షుడు తన ఆఖరి ఘడియల్లో స్వామివారిని తనవైపు చూడమని ప్రార్థించాడు.
అందువల్లే స్వామి శరీరం పడమర వైపుగా ఉన్న
మొహం దక్షిణం వైపు ఉంటుంది. స్వామి వారు నడుం పై చేయ్యి పెట్టుకొని గంభీరంగా కనిపిస్తాడు.
8. ఇక ఇక్కడ వెలిసిన అంబుజవల్లీ అమ్మవారికి స్వామి వారిని అందమైన రూపంలో చూడాలని కోరుకొంటుంది. దీంతో స్వామి వారు శంఖ, చక్రాలను కలిగి అందమైన నారాయణుడి రూపంలో వెలిశాడు.
9.అందువల్లే ఇక్కడ ఉత్సవ మూర్తి విగ్రహం
వరాహ రూపంలో కాక, నారాయణుడి రూపంలో ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో కాకుండా ఆలయంలోని వేరొక మండపంలో ఉండటం ఇక్కడ విశేషం.
10. వరాహ స్వామితో పాటు చిన్న గోపాలుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు.
వరాహ స్వామితో పాటు గోపాలుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
11. ఈ ఆలయంలో పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
మొదటి రోజు భరణీ నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
12. ఆ సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లో ఉన్న సముద్రం వద్దకు తీసుకువెళతారు.
అక్కడకు చేరుకొనే లోపు తాయ్ కల్ అనే గ్రామంలో
ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగిపోతుంది.
13. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మసీదుకు చెందిన కాజీ, స్వామి వారికి పూల దండ సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
మసీదులో కర్పూరం వెలిగించి తర్వాత
ఖురాన్ చదువుతారు. బాణా సంచా కూడా కాల్చిన తర్వాత ఊరేగింపు యథావిధిగా సాగుతుంది.
14. ఇందుకు సంబంధించిన కథనం కూడా ఉంది.
ఒక సారి ఇక్కడి నవాబుకి జబ్బు చేస్తుంది.
విషయం తెలుసుకొన్ని స్థానిక మధ్వ బ్రాహ్మణుడు నవాబుని కలిసి స్వామి వారి గుడి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని ఇస్తాడు.
15. క్షణాల్లో రాజు రోగం తగ్గిపోతుంది.
దీంతో నవాబు మిక్కిలి సంతోషంతో ఆ ఆలయానికి
అనేక ఎకరాల సారవంతమైన భూమిని దానం చేశారు. ఈ భూమి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణుల రక్షణలో ఉంది.
16. ఇక్కడ చిత్రై ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. శ్రీదేవి ,భూదేవి సమేతంగా స్వామి వారిని ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడల వీధుల్లో ఊరేగిస్తారు.
17. అటు పై ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఉత్సవాల్లో దేవేరులతో కలిసి స్వామి వారు చుట్టు పక్కల గ్రామాలకు వెళుతుంటారు. ఆ సమయంలో ఆయా గ్రామాల వారు గ్రామ పండుగను చేస్తారు.
18. ఇక్కడ కొలువై ఉన్న అంబుజవల్లికి నవరాత్రుల్లో
విశేష పూజలు నిర్వహిస్తారు.
తమిళ నెలలైన అడి, తాయ్ లలో ఆఖరి శుక్రవారంనాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.
19. ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల సకల సంపదలూ లభిస్తాయని చెబుతారు.
గ్రహ దోషాలున్నవారు ఇక్కడ స్వామివారిని కొలిస్తే
ఆ బాధలన్నీ తొలిగిపోతాయని స్థానికుల నమ్మకం.