Breaking News

మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

durgamatha

మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.

అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.

దుర్గాస్తోత్రం

విరాటనగరం రమ్యం – గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీం

యశోదాగర్భసంభూతాం – నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం

కంసవిద్రావణకరీం – అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం – ఆకాశం ప్రతి గామినీం

వాసుదేవస్య భగినీం – దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం – ఖడ్గఖేటక ధారీణీం

భారావతరణే పుణ్యే – యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా – త్పంకేగా మివ దుర్బలాం

స్తోతుం ప్రచక్రమే భూయో – వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ – రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే – కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే – పూర్ణచంద్రనిభాననే

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి

భాసి దేవి యథా పద్మా – నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ – విశదం తవ ఖేచరి

కృష్ణచ్ఛవిసమా కృష్ణా – సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ – శక్రధ్వజసముచ్ఛ్రయౌ

పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం – కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ – కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన – శ్రోణీసూత్రేణ రాజతా

భ్రాజసే చావబద్ధేన – భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా – ముచ్ఛ్రి తేన విరాజసే

కౌమారం వ్రత మాస్థాయ – త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి – త్రిదశైః పూజ్యసే పి చ

త్రైలోక్యరక్షణార్థాయ – మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే – దయాం కురు శివా భవ

జయా త్వం విజయా చైవ – సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి – వరదా త్వం చ సాంప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే – తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి – సీధుమాంసపశుప్రియే

కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ – పుత్రతో ధనతో పి వా

దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం – మగ్నానాం చ మహార్ణవే

దస్యుభి ర్వా నిరుద్ధానాం – త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః – హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా – జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః – శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి – సత్యే సత్యా భవస్వ నః

శరణం భవమే దుర్గే – శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ – దర్శయామాస పాండవం

ఉపగమ్య తు రాజాన – మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో

భవిష్య త్యచిరా దేవ – సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం

రాజ్యం నిష్కంటకం కృత్వా – భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ – ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం

మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య – మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి – లోకే విగతకల్మషాః

తేషాం తుష్టా ప్రదాస్యామి – రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి – సంగ్రామే శత్రుసంకటే

అటవ్యాం దుర్గకాంతారే – గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా

న తేషాం దుర్లభం కించి – దస్మిన్ లోకే భవిష్యతి
య ఇదం పరమ స్తోత్రం – శృణుయా ద్వా పఠేత వా

తస్య సర్వాణి కార్యాణి – సిద్ధిం యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ – విరాటనగరే స్థితాన్

న ప్రఙ్ఞాస్యంతి కురవో – నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ – యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం – తత్రై వాంతరధీయత

ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరం.

పై మంత్రంతో దుర్గమ్మను నిష్ఠతో పూజించే వారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. ఇంకా అమ్మవారి పూజ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలు ఇచ్చుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *