వైశాఖ మాసం లో మాత్రమే స్వామి దర్శనం-11 నెలలు నీటిలో మునిగి ఉంటాడు
ఏడాది పొడవునా గంగలో మునిగేసే భక్తులకు దర్శనం ఇచ్చేందుకు పైకి తేలాడు,1 నెల రోజులు మాత్రమే కనిపిస్తాడు.
నెల రోజులు పూర్తి అవ్వగానే మళ్ళీ మడుగులో బడుంగ్ మంటాడు , భక్తులకు కనిపించకుండా మాయం అవుతాడు
ఆ విచిత్ర శివుడ్ని దర్శించుకోవాలనుకుంటే ఛలో నత్తా రామేశ్వరం
దక్షిణ కాశీగా పేరుగాంచిన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామం లో ఉన్న నత్తా రామలింగేశ్వర ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
గొస్తాని నది తీరం లో ఉన్న రామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో మునిగే ఉంటాడు.
పరశురాముడు తన తల్లిని చంపిన పాపానికి పరిహారం కోసం నత్తా రామేశ్వరం లో శివలింగాన్ని ప్రతిష్టించినట్టు పురాణ కథనం
అత్యంత ఆవేశ పూరితుడైన పరుశురాముడు ప్రతిష్టించిన శివలింగం ఊరుని దహించి వేస్తుందని భయం తో….. దాన్ని పూర్తిగా నీటి లో ముంచుతారు. ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉండే రామేశ్వరుడు వైశాఖ మాసం లో మాత్రమే భక్తులకి దర్శనమిస్తాడు.